విజయవాడ బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లై ఓవరును ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… విజయవాడ వాసుల దశాబ్దాల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుండటం సంతోషంగా ఉంది. గడ్కరీ విజయవాడ నగరానికి ఏది అడిగినా కాదనకుండా చేశారు అని తెలిపారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతో రికార్డు కాలంలో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. రెండో ఫ్లైఓవరును అనుకున్న సమయానికి 6 నెలల…