Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mlc Election Notification Tomorrow In Telugu States

రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌.. అభ్యర్థులపై ఉత్కంఠ..!

Published Date :November 8, 2021 , 9:49 pm
By Sudhakar Ravula
రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌.. అభ్యర్థులపై ఉత్కంఠ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్‌. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో.. ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7,మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్‌.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • MLC Election
  • MLC Election 2021
  • MLC Election Notification
  • telangana

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions