Botsa Satyanarayana: శాసన మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎండోమెంట్ మినిస్టర్ ప్రశ్నకు సంబంధం లేని సమాధానం చెప్పారు.. సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించడం దురదృష్టకరం అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.
Read Also: ANR : 101 ఏళ్ల ఏఎన్ఆర్ జ్ఞాపకార్థం.. అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్
ఇక, ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు దేవాదాయ శాఖ మంత్రికి అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆనం రామనారాయణ రెడ్డి నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు.. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు.. ప్రజలకు మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యత.. కల్తీ మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు.. మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదు.. తిరుపతి, సింహాచలం ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే మంత్రి డొంక తిరుగుడు సమాధానం ఇస్తున్నారు.. జగన్ పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారు.. మేం ఎంతో హుందాగా ప్రశ్నలు అడిగాం.. కానీ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి బొత్స తెలిపారు.
Read Also: Fauji : ప్రభాస్ ఫౌజీ మూవీతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో
అయితే, తిరుపతి, సింహాచలం ఘటనలతో కూటమి ప్రభుత్వానికి, మంత్రికి సంబంధం లేదా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు, దేవుడు అంటే లెక్కలేదు అని సెటైర్లు వేశారు. ఎంత సేపూ కుర్చీ కోసమే ఆరాటం తప్పా.. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు.. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశాం.. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే అంశాలనే మేం తీసుకుంటున్నాం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలి అని బొత్స డిమాండ్ చేశారు.
