Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా చిత్ర నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచిన సినిమాల కలెక్షన్లలో ఏకంగా 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది పాత నిబందనే కానీ నిర్మాతలు ఫాలో కాకపోవడంతో మరోసారి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన అదనపు కలెక్షన్లో 20 శాతం మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాల్లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. సినిమా రంగంలో నిరంతరం శ్రమిస్తున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ 20 శాతం మొత్తాన్ని నేరుగా ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానుల) నుంచి వసూలు చేసి సంబంధిత ఖాతాలకు జమ చేసే పూర్తి బాధ్యతను ఆయా చిత్రాల నిర్మాతలకే అప్పగించారు.
Also Read
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఇటీవల విడుదలైన, అలాగే విడుదలకు సిద్ధమవుతున్న పలు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా పెద్ది’, ‘రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల పెంపు ద్వారా సమకూరిన కలెక్షన్ల నుంచి ఈ 20 శాతం వాటాను వెంటనే చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సాధారణంగా పెద్ద సినిమాల బడ్జెట్ రికవరీ కోసం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. అయితే, ఆ పెంచిన ధరల భారం ప్రేక్షకులపై పడుతున్న తరుణంలో, అందులోంచి వచ్చే ఆదాయాన్ని సినిమా రంగానికి వెన్నెముకగా నిలిచే కార్మికుల సంక్షేమానికి మళ్లించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!