Kotamreddy vs Anil Kumar Yadav: నెల్లూరు జిల్లా రాజకీయాలు అసలే కాకమీదున్నాయి.. వైసీపీ నేతలు, తిరుగుబాటు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అదికాస్తా ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. ఇప్పుడు అది ఘర్షణ వరకు వెళ్లింది.. నెల్లూరు బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుఇంది.. ఈ ఘటనలో సమీర్ ఖాన్ అనే వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యారు.. ఇక, వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం సమీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనలో కోటంరెడ్డి వర్గీయుడు సయ్యద్, సమీ, హుస్సేన్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.. మరోవైపు, రెండు వర్గాల ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పోలీసులు భారీగా మోహరించారు. అసలు ఘర్షణ ఇరు వర్గాల మధ్య ఎందుకు చోటుచేసుకుంది.. వివాదానికి కారణం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.