Mla Tulabharam: బూరెలతో తులాభారం.. ఎమ్మెల్యే రూటే సపరేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. గతంలో అల్లుడికి భారీస్థాయిలో సారె పంపిన కథ విన్నాం, చూశాం. అదే అల్లుడి అత్తగారికి కూడా తమ తరఫున ఆషాడం సారె పంపారు. వందల కిలోల స్వీట్లు, హాట్లు… అరటిపళ్ళు….ఇలా ఎందులోనూ తగ్గేది లేదని రెండు కుటుంబాల వారు తమ విలక్షణత చాటుకున్నారు. ఓ ఎమ్మెల్యే తులాభారం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి బూర్లతో తులాభారం తూగారు. అదేదో డబ్బులు, బంగారం, వెండి, బెల్లంతో కాదు. ఏకంగా బూర్లతో ఆయన తూగిన తులాభారం చూడడానికి రెండు కళ్ళు చాలలేదంటున్నారు జనం.
బూర్లు అంటే పండుగ సమయాల్లో అందరూ చేసుకొని తినే బూర్లతోనే అమ్మవారికి ఆయన మొక్కు తీర్చుకున్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుబండి రమేష్ శాసనసభ్యులుగా చిర్ల జగ్గిరెడ్డి మళ్ళీ గెలుపొందితే బూరెలతో తులాభారం వేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నాడు. బడుగువానిలంక కొండాలమ్మ అమ్మవారికి మొక్కుకున్న ఆ మొక్కును తీర్చుకున్నాడు.
Also Read
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అభిమాని కోరికను కాదనకుండా అతని మొక్కును చెల్లించుకున్నారు. సుమారు 125 కేజీలతో తొమ్మిదివేల బూర్లను అమ్మవారికి మొక్కుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ఎప్పటినుంచో ఈ సంప్రదాయం వుందని, దానిని పాటించడం తమ కర్తవ్యం అంటున్నారు గ్రామస్తులు. ఈ బూరెల తులాభారం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!