Minor Girl Killed After Molested By Two Boys In Krishna District: కృష్ణా జిల్లాలోని పామర్రులో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక మౌనశ్రీ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 20న పాఠశాలకు వెళ్లి, ఆదివారం సాయంత్రం కాలువలో శవమై తేలిన ఆ బాలికపై ఇద్దరు అత్యాచారం చేసినట్టు గుర్తించారు. కొండిపరు గ్రామానికి చెందిన చిల్లిముంత లోకేష్, లంక నరేంద్ర అనే ఇద్దరు యువకులు.. ఆ మైనర్ బాలికని ఉయ్యూరు లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడిందా? లేక వాళ్లిద్దరు హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక తల్లి వాణి తన కూతురి మృతదేహాన్ని చూసి రోధిస్తూ.. సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక మౌనశ్రీ పామర్రు మండలంలోని నిమ్మకూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి ఈ బాలికతో లోకేష్ అనే యువకుడు చాటింగ్ చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఈనెల 20వ తేదీన ఆమె స్కూలుకి బయలుదేరగా.. లోకేష్ ఆమెకు మాయమాటలు చెప్పి, ఉయ్యూరులో ఉన్న లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ లోకేష్‌తో పాటు అతని సోదరుడు నరేంద్ర కలిసి.. ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం లోకేష్ ఆ బాలికని గ్రామం వద్ద దింపేసి వెళ్లిపోయాడు. అటు.. స్కూలుకి వెళ్లిన మౌనశ్రీ సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. నేడు సాయంత్రం మొవ్వ మండలం మంత్రిపాలెం కాల్వలో బాలిక మృతదేహం కనిపించింది. కేసుని సీరియస్‌గా తీసుకుని విచారించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. వారిపై తాము రౌడీ షీట్లు తెరుస్తామని కృష్ణా ఎస్పీ జాషువా తెలిపారు.
UP Minister: టమాటా తినడం మానేయండి.. అధిక ధరలపై యూపీ మంత్రి కీలక వ్యాఖ్యలు