Minister Vidadala Rajini: యువశక్తి పేరుతో కార్యక్రమానికి నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీపై సెటైర్లు వేశారు మంత్రి విడదల రజిని.. ఇక, పవన్ కల్యాణ్ తన కార్యక్రమానికి యువశక్తి అని కాకుండా నారా శక్తి అని పేరుపెట్టుకుoటే బాగుండేదని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుని ఏవిధంగా కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న అజెండా తప్ప పవన్ కల్యాణ్‌కు ఇంకో అజెండా లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ రోజు ప్రజలకు మంచి చేసిన పరిస్థితి లేదు.. ఇప్పుడు మేం మంచి చేస్తుంటే ఏడవడం ఆయన నైజంగా మారిందని ఫైర్ అయ్యారు. మేం చేపట్టిన ఉద్దానం ప్రాంత పర్యటనలో ఏ రాజకీయం లేదు.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే ఇక్కడి పరిస్థితులు తెలుసుకోడానికి పర్యటించామన్నారు.. ఉద్దానం ప్రాంత ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. సీఎం జగనన్న ఏం చేశారో ధైర్యంగా మేం చెప్పగలం.. ప్రజలు కూడా చెబుతారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజినీ..
Read Also: Covid19 : కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఉపశమనం లేదా.. అయితే ఏం చేయాలి..?
పలాసలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి విడుదల రజినీ సమీక్ష సమావేశం నిర్వహించారు.. యాబై కొట్లతో పలాసలో సుపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేయాలని భావిస్తున్నాం.. కిడ్నీ కేర్ అండ్ క్రిటికల్ కేర్ సేవలు అందిస్తాం.. ఉద్దానం ప్రజల త్రాగునీటి సమష్య పరిస్కారం కోసం రూ.700 కొట్లతో వంశధార నుంచి నీటిని తరలిస్తాం అన్నారు. ఏమాత్రం పట్టించుకోని స్థితి నుంచి సౌకర్యాలు అందిస్తున్నామని.. చంద్రబాబు గతంలో ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడిపించారని ఆరోపించారు.. ఓట్ల కోసం మటాలు చెప్పి సరిపెట్టారని విమర్శించారు.. మా ప్రభుత్వం మరింత మంచి వైద్యసేవలు అందిస్తున్నారని రోగులే చెబుతున్నారని తెలిపారు.. చంద్రబాబుది మాటల ప్రభుత్వం .. జగనన్నది చేతల ప్రభుత్వం అని ప్రకటించారు మంత్రి విడదల రజినీ.