YSRCP: పవన్‌కు మంత్రి పేర్నినాని కౌంటర్.. నమస్కారాలకు ప్రతి నమస్కారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ ప్రశ్నించారు.. టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నాడని ఆరోపించిన మంత్రి.. పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి వస్తారని టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక, జనసేన సభలోనూ సినిమా డైలాగులనే పేల్చారని పవన్‌పై సెటైర్లు వేసిన మంత్రి పేర్నినాని.. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా? అని నిలదీశారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగలేరా? అని నిలదీశారు.. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగగలరా? అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమా డైలాగులే చెప్పారని ఎద్దేవా చేసిన ఆయన.. గల్లీలోనే మన డైలాగ్‌లు.. మరి ఢిల్లీలో ఎందుకు నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు. వెల్లంపల్లి వెల్లుల్లి, ర్యాంబో రాంబాబు అంటూ మీరు మాట్లాడొచ్చా..? ఆడ మగ తేడా లేకుండా మీరు మానసిక అత్యాచారం చెయ్యొచ్చా..? అని ఫైర్ అయ్యారు. ఇక, సభ ప్రారంభంలో.. ఎవ్వరినీ వదలకుండా పవన్ కల్యాణ్ నమస్కారాలు పెట్టారు.. నాకు సంస్కారం ఉంది.. కాబట్టి.. వైసీపీ నేతలకు కూడా నమస్కారాలు చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆయనకు ప్రతిగా నమస్కారాలు పెట్టారు పేర్నినాని..
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?