Site icon NTV Telugu

MInister Peddireddy: భూ సర్వేతో ఏపీని జగన్‌ తొలి స్థానంలో నిలిపారు.. ఇక, చంద్రబాబు సీఎం కాలేరు..!

Minister Peddireddy

Minister Peddireddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు సందించారు.. భూ సర్వే చారిత్రాత్మ క నిర్ణయమన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారు.. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం.. భూ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగనన్న నిలిపారని పేర్కొన్నారు.. కానీ, మీ భూములను లాక్కుంటున్నారని, గోల్ మాల్ చేస్తారని ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు..

Read Also: రుషికొండలో నారాయణ పర్యటన.. ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు..!

వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వ హించలేదని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, పాదయాత్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కళ్లారా చూసిన సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి.. ఆ హామీలను దాదాపు పూర్తిగా అమలు చేశారని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు పేజీలకు పేజీలు మేనిఫెస్టోలు రూపొందించి అమలు చేయకుండా చేతులెత్తాసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నడవలేని వ్యక్తికి ఊతకర్ర ఇచ్చినా లేచి నడవగలడు.. కానీ, పడుకొని ఉన్న వ్యక్తికి ఊతకర్ర ఇచ్చినా నడవలేడని.. అలాగే చంద్రబాబు తన సామాజిక వర్గం, తన అనుకూల మీడియా ఎలా ఊతమిచ్చినా అధికారంలోకి రాలేడంటూ ఎద్దేవా చేశారు. చం ద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కావడం జరగదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.

Exit mobile version