ఇది సీఎం జగన్‌ ప్రభంజనం.. టీడీపీ ఆఫీసు ఇక అద్దెకే..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే మంచిదన్న ఆయన.. జగన్, చంద్రబాబు ను కుప్పం మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చారని వ్యాఖ్యానించారు.

Read Also: విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు

చంద్రబాబు, లోకేష్, కుటుంబ సభ్యులు అందరూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి కుప్పంలో వచ్చిందన్నారు మంత్రి వెల్లంపల్లి… అయినా కుప్పంలో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్న ఆయన.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి కుప్పం ప్రజలు మాకు పట్టం కట్టారని.. ఆంధ్రప్రదేశ్ వైసీపీ అడ్డా… వేరే పార్టీలకు స్థానమే లేదు అని తేలిపోయిందన్నారు.. కుప్పంలో లోకేష్ వీధి వీధి తిరగి… గొడవలు చేయటానికి ప్రయత్నం చేశారని మండిపడ్డ మంత్రి.. 2019 నుంచి వైసీపీలో అదే జోష్ కొనసాగుతోందన్నారు.

Related Articles

Latest Articles