PeddiReddy: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. అగ్రదేశాల్లో విధానాలపై అధ్యయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PeddiReddy: ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణపై అధికారులతో ఆదివారం మరోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేసి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించారు.
Read Also: Raveena Tandon: నగ్న వీడియోలు పంపి టార్చర్ చేశాడు.. కెజిఎఫ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
విద్యుత్ సంస్థల ప్రాథమిక బాధ్యతను ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. వీటి ఆధారంగా స్థానిక అవసరాలకు తగినట్లు కట్టదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని ఆయన ఆదేశించారు. దీనిలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆ సమావేశాల్లో విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణకు సంబందించిన అంశాలను చర్చించాలని సూచించారు. ఈ కమిటీల సహకారంతో గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాలన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!