PeddiReddy: ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణపై అధికారులతో ఆదివారం మరోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్…
Minister PeddiReddy Ramachandra Reddy: ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం నాడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంను…
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు…