PeddiReddy: ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణపై అధికారులతో ఆదివారం మరోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్…