టీడీపీ మోసపూరిత పార్టీ అని ఆ పార్టీతో కలసి వెళ్లకూడదని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతుందని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. కార్తీకమాసం సోమవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు.. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు ఆలయ మర్యాదలనుసరించి అర్చకులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి దంపతులకు అర్చకులు వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా.. స్వామి అమ్మవారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను ఈవో లవన్న అందజేశారు.
Read Also: Superstar Krishna: ఆయన ఓ ఫైటర్.. దీన్నుంచి బయటికి వస్తారు
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ.. శ్రీశైలంలో నిన్నటి ట్రాఫిక్ జామ్‌కి కారణం పోలీస్ సిబ్బంది లోపమే అన్నారు.. నిన్న రాత్రి నేను కూడా రెండు గంటలు ట్రాఫిక్ లో ఉన్నానని మంత్రి కొట్టు అన్నారు. ఇక, రాజకీయాలపై స్పందించిన ఆయన.. నారా లోకేష్‌కి సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.. మంగళగిరి అని స్పష్టంగా పలకమని చెప్పమనండి లోకేష్ ని చూద్దామంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే పవన్ కల్యాణ్ అలా నడుచుకుంటున్నాడని ఆరోపించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ నోరు తగ్గించుకున్నరాని సెటైర్లు వేశారు. ఇక, జగనన్న కాలనీలమీద సోషల్ ఆడిట్ అని పవన్ కల్యాణ్ తప్పుచేస్తున్నాడని మండిపడ్డారు.. ఇప్పటికే పవన్ మాటతీరు పరివర్తన భాషాతో మా సామాజికవర్గంలో ఇలాంటి నాయకుడినా మేం అనుకున్నది అనే పరిస్థితికి పవన్ వచ్చాడని ఎద్దేవా చేశారు.. జగనన్న కాలనీలలోకెళ్లి పవన్ కల్యాణ్ సోషల్ ఆడిట్ చేస్తే మహిళలందరూ.. చీపురుకట్ట తిరగేసికొట్టే పరిస్థితి ఉందని హెచ్చరించారు.. అలానే విశాఖ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవిస్తే విశాఖని అభివృద్ధి చేయొచ్చని మోడీ చెప్పారాని.. దీంతో, విశాఖను రాజధానిగా చేసేదానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినట్లుగా నిన్న మోడీ మాట్లాడారని చెప్పారు. ఇదే సమయంలో.. టీడీపీ మోసపూరిత పార్టీ అని.. ఆ పార్టీతో కలసి వెళ్లకూడదని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.