Kottu Satyanarayana: పవన్ కల్యాణ్‌ది మా సామాజిక వర్గం.. నాకు అభిమానం ఉండదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్‌ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు.. కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదని స్పష్టం చేశారు.. పవన్ వెనక తిరిగే వారికి మాత్రమే పవన్ సీఎం కావాలనే కోరిక ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై స్పందిస్తూ.. చంద్రబాబుతో పవన్ పొత్తు అపవిత్ర కలయికగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Also Read
మరోవైపు.. విజయనగరం దేవదాయ శాఖ ఏసీ పరిధి దాటారని ఫైర్ అయ్యారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పరిధి దాటిన ఏసీపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. దేవాలయాల భూములను కాపాడడం మా బాధ్యత.. పీఠాధిపతులు.. మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.. త్వరలో తేదీ ఖరారు చేస్తాం అన్నారు.. హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చిస్తాం అన్నారు. రూ. 249 కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.. వీటిలో చాలా వరకు టెండర్లు పిలిచాం అన్నారు.. సీజీఎఫ్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్ధి చేపడుతున్నాం.. సీజీఎఫ్ నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణపై ప్రతి 15 రోజులకూ సమీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. ఆలయాల నుంచి సీజీఎఫ్ నిధులు జమ అవుతున్నాయని.. 13 మందితో ఆగమ సలహాదారుల బోర్డు ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఏపీలో బలవంతపు మత మార్పిళ్లు జరగడం లేదన్నారు.. బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయనే అంశం మా దృష్టికి రాలేదని.. దేవాదాయ శాఖలో పని చేసే వారిలో దళితులే ఎక్కువ శాతం మంది ఉన్నారని వెల్లడించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..