రాష్ట్రంలో టీడీపీకి బీ- పార్టీగా బీజేపీ మారింది : కొడాలి నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించి ముందుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీకి రాష్ట్రంలో ఏ అంశమూ లేదని, ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం సహా ఏదేదో చేస్తున్నారన్నారు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకూ ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారని, ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరతాడు.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే చంద్రబాబును ఎవరైనా ఆపారా ..? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పేరును కూడా చంపేయాలని నీచమైన ఆలోచన చంద్రబాబుది అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఒడిపోయి అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఛీర్ బాయ్స్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తాడు..సోము వీర్రాజు అమలు చేస్తారు. రాష్ట్రంలో టీడీపీకు బీ- పార్టీగా బీజేపీ మారింది. సోము వీర్రాజు టీడీపీకి బీ టీంగా బీజేపీని తయారు చేశారు. సోము వీర్రాజు బీజేపీని చంద్రబాబుకు అద్దెకిచ్చారు. జిల్లాల విభజన అనగానే ఉద్యోగుల ఆందోళనలు పక్కకు వెళ్ళి పోయాయా..? ఉద్యోగులు ఆందోళనలు మానేశారా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తులు ఇలా మాట్లాడితారా అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Also Read
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!