Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు తదుపరి న్యూజిలాండ్‌తో మల్టీ-ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ల స్థానాలపై మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ పిచ్‌లు, జట్టు సమతుల్యత దృష్ట్యా ఈ ఇద్దరూ ఒకే తుది జట్టులో ఆడే అవకాశం తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.
సంజు శాంసన్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లకు నిలకడ అనేది ఒక అపోహ మాత్రమేనని పుజారా పేర్కొన్నారు. “టీ20ల్లో ఎవరికైనా వైఫల్యాలు సహజం. సంజు ఫామ్ హెచ్చుతగ్గులకు లోనవుతుండవచ్చు కానీ, ఆయన ఎప్పుడూ ఫామ్‌లో లేడనుకోలేం. అతడు ఆడే ఒక్క ఇన్నింగ్స్ చాలు మళ్లీ ఫామ్‌లోకి రావడానికి” అని పుజారా వివరించారు. మరో మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కొద్ది మ్యాచ్‌లు విఫలమవగానే సంజుపై విమర్శలు రావడం, ఆ తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆయన వాటిని తిప్పికొట్టడం సర్వసాధారణమని అన్నారు.
Also Read
- Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
- Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే..
వెస్టిండీస్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకోని వైభవ్ సూర్యవంశీకి, న్యూజిలాండ్ గడ్డపై తుది జట్టులో చోటు దక్కడం కష్టమని పుజారా అంచనా వేశారు. న్యూజిలాండ్ పరిస్థితులకు తగినట్లుగా జట్టులో స్పిన్ లేదా సీమ్ ఆల్ రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల టాప్ ఆర్డర్లో ఎక్కువ మంది బ్యాటర్ల అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సంజు శాంసన్ లేదా వైభవ్.. వీరిద్దరిలో ఎవరో ఒకరే ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని, ఇద్దరూ కలిసి తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని పేర్కొన్నారు. పరిస్థితులు, పిచ్ స్వభావం లేదా ఆటగాళ్ల ఫిట్నెస్ ఆధారంగా భవిష్యత్తులో వైభవ్‌కు ప్లేస్ దక్కే అవకాశం ఉందని పుజారా తెలిపారు.
తాజావార్తలు
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!