Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంక, ఇంగ్లండ్‌లతో పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 16,000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా బాబర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు బాబర్‌కు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మ్యాచ్ ప్రారంభమైన త్వరలోనే ఆ టార్గెట్ పూర్తి చేసి ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ ఘనత సాధించేందుకు బాబర్ ఆజమ్ కేవలం 399 ఇన్నింగ్స్‌లను మాత్రమే తీసుకున్నాడు. పాకిస్థాన్ తరఫున అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. పాక్ తరఫున మహ్మద్ యూసఫ్ (388 ఇన్నింగ్స్), జావేద్ మియాందాద్ (398 ఇన్నింగ్స్) మాత్రమే బాబర్ కంటే ముందున్నారు. పాకిస్థాన్ తరఫున ఇంతకుముందు జావేద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, ఇన్మామౌల్ హక్, యూనిస్ ఖాన్ మాత్రమే ఈ మార్కును అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాబర్ ఆజమ్ ఐదో ఆటగాడిగా చేరాడు.
Also Read
- Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
- Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, మూడో ఓవర్లో ఓపెనర్ సాయిమ్ అయూబ్ వెనుదిరిగిన తర్వాత బాబర్ మూడో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుతమైన డ్రైవ్‌తో ఖాతా తెరిచిన బాబర్, మరో చక్కటి షాట్‌తో 16 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడిన 32 ఏళ్ల బాబర్ ఆజమ్ 57 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి ఈషాన్ మలింగ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా శ్రీలంక, ఇంగ్లండ్ జట్లతో జరుగుతున్న ఈ వన్డే ట్రై సిరీస్ డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగుతోంది. అక్టోబర్ 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు మాత్రం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (350 ఇన్నింగ్స్) పేరిటే కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
-
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!