తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు పరిపాలన చేరువ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాంలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. దానిలో మరో ముందడుగు వేసి జిల్లాల సంఖ్యను పెంచారన్నారు.
Read Also: నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం
కొడాలి నానిని లక్ష్యంగా చేసుకునే క్రమంలో చంద్రబాబు అండ్ కో ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఏదో వివచ్చలవిడిగా కొన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం జగన్, కొడాలి నాని పై వారికున్న ద్వేషాన్ని చూపిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరలపై రికార్డింగ్ డ్యాన్స్‌లు వేసుకున్న వాళ్ళు కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నామన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు అండ్ కో.. పచ్చ బ్యాచ్‌కు లేదని విమర్శించారు. గతంలో వీళ్ళు చేసిన విచ్చలవిడి చర్యలను మేము చూపిస్తామని మంత్రి అన్నారు. పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వాళ్లే రికార్డింగ్ డ్యాన్సులు వేశారని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు బాటలో నడుస్తోందని ప్రజలకు అర్థమవుతుందని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని సోము వీర్రాజు అర్థం చేసుకోవాలని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.