Minister Gudivada Amarnath: పవర్ స్టార్ కాదు.. ఫ్లవర్ స్టార్.. వాళ్లు జన సైనికులా..? జన సైకోలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్.. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారని మండిపడ్డారు. గర్జన సభకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లభించింది.. కానీ, జేఏసీ విశాఖ గర్జనకు పిలుపిచ్చిన రోజునే.. పవన్ ఎందుకు విశాఖ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారు జన సైనికులా..? జన సైకోలా..? అంటూ తీవ్రంగా స్పందించారు.. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారన్న ఆయన.. ఈ దాడికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. ఇది ఉత్తరాంధ్ర ఉద్యమం మీద జరిగిన దాడిగానే మేం భావిస్తున్నాం అన్నారు.. చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయ శిఖండిగా మారారు.. ఉదయం జరిగిన ఉద్యమాన్ని పక్క దారి పట్టించేందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు..
Read Also: Vishnuvardhan Reddy: ఎవరు దాడి చేసినా తప్పే.. ఎవరి ప్రభుత్వం ఉంది? బాధ్యత ఎవరిది?
Also Read
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
విశాఖ గర్జనపై చర్చ జరగ కుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందని విమర్శించారు మంత్రి అమర్నాథ్.. పవన్ కల్యాణ్ నుంచే జనసేన కార్యకర్తలకు సైకో మెంటాల్టీ వచ్చిందన్న ఆయన.. పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరాం.. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రయత్నం చేశాం.. కానీ, దానిపై చర్చ జరగకుండా చేసే కుట్ర చేశారని ఆరోపించారు. ఇక, మంత్రులకూ.. వైసీపీ నాయకత్వానికి పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించని పవన్.. విశాఖకు ఎందుకొచ్చారు..? అని మండిపడ్డారు. పవర్ స్టార్ కాదు.. ఆయన ఫ్లవర్ స్టార్.. అంటూ పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో పవన్‌ను ఓడించారని ఉత్తరాంధ్రపై పవన్ కక్ష కట్టారన్న ఆయన.. మా పార్టీ కార్యకర్తలకు సైగ చేస్తే పవన్ తట్టుకోగలరా..? అని ఫైర్ అయ్యారు.
Read Also: Flash Flash: విశాఖలో మంత్రుల కార్లపై రాళ్ల దాడి.. ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్తత..
ఓ పాలసీ, లక్ష్యం లేకుండా వ్యవహరిస్తే.. ఇలాగే ఉంటుంది.. ఎక్కడికెళ్తే అక్కడే రాజధాని అంటున్నారు.. ప్రజల కోసం బతకకున్నా.. మీ కోసమైనా బతకాలిగా అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.. పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్‌మెంట్.. ఇంట్లోనే సర్దుకుపోలేని పవన్.. ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని ఎద్దేవా చేశారు.. పవన్‌కు సినీ జీవితాన్నిచ్చింది విశాఖ, పిల్లనిచ్చి పెళ్లి చేసింది విశాఖ.. రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది విశాఖ… కానీ, పవన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!