Minister Gottipati Ravi: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను నేపథ్యంలో ముగ్గురు సీఎండీలతో మాట్లాడారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొంథా తుఫాను దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
Read Also: OTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు ఇవే
ఇక, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతర శాఖలతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలి.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాల దగ్గర ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నెంబర్ కు సమాచారం అందించాలని గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు.