OTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సినిమాలు రిలీజయ్యాక థియేటర్లలో చూడ్డం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినమాలలో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీకొట్టు ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్‌లోఇడ్లీ కడాయ్‌గా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రిలీజై నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్దమైంది.
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసిన సినిమా ‘కొత్త లోక: చాప్టర్ 1’. మలయాళంలో తెరకెక్కిన మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ. తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తనదైన యాక్షన్‌తో ఆకట్టుకోగా, సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ అక్టోబర్ 31నుంచి స్ట్రీమింగ్ అని జియో హాట్‌స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం పరమ్ సుందరి . తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకువచ్చి ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు న్యూస్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
థియేటర్‌తో పాటు ఓటీటీలో విడుదలైన సినిమాలు కూడా స్పెషల్ ఆడియెన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు తక్షకుడు అనే యాక్షన్ ఫిల్మ్‌తో వస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈసినిమా విడుదల కానుంది. వినోద్ దర్శకత్వంలో ఇది రూపొందిన ఈ సినిమా… ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు మూవీ టీం.
తమిళ నటుడు విజయ్ ఆంటోని తన కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందిన శక్తి తిరుమగన్, తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని తన నటనతో మెప్పించాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ 24 నుంచి ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!