Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddhanth Kapoor: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసుతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీపై పోలీసుల దాడి అనంతరం నమోదైన కేసులో ఆయన పేరు వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ కేసులో సిద్ధాంత్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
2022లో బెంగళూరులోని ఓ హోటల్లో నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో సిద్ధాంత్ కపూర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని, మాదకద్రవ్యాలు సేవించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అనంతరం సిద్ధాంత్‌తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఈ కేసు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సిద్ధాంత్ మొదటి నుంచే ఖండించారు. తాను తెలిసి ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, తన వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదని కూడా పేర్కొన్నారు. అరెస్టు అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read
తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ సిద్ధాంత్ కపూర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం. నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ ఎఫ్ఐఆర్ను రద్దు చేశారు. బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం, ఈ కేసులో ప్రైవేట్ ల్యాబ్ నిర్వహించిన మూత్ర పరీక్షల ఆధారంగానే అభియోగాలు మోపినట్లు కోర్టు గుర్తించింది. అలాంటి పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు ఉన్నాయని, వాటినే ప్రధాన ఆధారంగా తీసుకుని క్రిమినల్ కేసు కొనసాగించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అంతేకాదు, రక్తం, మూత్ర నమూనాలను సేకరించడం, పరీక్షించడం వంటి ప్రక్రియలో కూడా విధానపరమైన లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించినట్లు సమాచారం. గతంలో పోలీసుల వాదన ప్రకారం సిద్ధాంత్ కపూర్ మూత్ర నమూనాలో గంజాయి, కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే విచారణలో ఆ ఆధారాలపై తగిన న్యాయపరమైన స్పష్టత లేకపోవడంతో కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చింది.
సిద్ధాంత్ కపూర్ సినీ ప్రయాణం కూడా ప్రత్యేకమే. 2013లో విడుదలైన ‘షూటౌట్ ఎట్ వాడాలా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆయన, అనంతరం ‘అగ్లీ’, ‘జజ్బా’, ‘పల్టన్’, ‘బొంబైరియా’, ‘చెహ్రే’, ‘భూత్ పార్ట్ వన్: ది హాంటెడ్ షిప్’ వంటి చిత్రాల్లో నటించారు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి ‘హసీనా పార్కర్’ చిత్రంలో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమాలతో పాటు ‘భౌకాల్’, ‘మండల మర్డర్స్’ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటించారు. ఇటీవల ఆయన నటించిన ‘హ్యూమన్ కొకైన్’ ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.
హైకోర్టు తాజా తీర్పుతో సిద్ధాంత్ కపూర్‌కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినప్పటికీ, ఆయన తదుపరి సినీ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ తీర్పు తర్వాత ఆయన మళ్లీ పూర్తి స్థాయిలో కెరీర్‌పై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..