ఏపీ ఒక్కటే అప్పులు చేయలేదు : మంత్రి అవంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా జగన్‌కు తెలుసునని వివరించారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, విస్తరించడం ద్వారా ఏటా రూ. 200 కోట్ల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో కానీ, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక స్థలాలు, ఆస్తులను లీజుకు తీసుకున్న వారి నుంచి రూ. 31.08 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే వసూలు చేస్తామన్నారు. పర్యాటక సంస్థకు చెందిన 18 రెస్టారెంట్ల నిర్వహణకు 50 టెండర్లు వచ్చాయని, పరిశీలన అనంతరం వాటిని ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్నా అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!