Minister Ambati Rambabu: చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని.. పట్టిసీమ పేరుతో కూడా దోపిడీ చేశారని మంత్రి తెలిపారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి సెటైర్లు వేశారు.
Janago: మా భూమిని కబ్జా చేసారు.. దంపతుల సెల్ఫీ వీడియో.. సూసైడ్ లెటర్….!
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
అంతేకాకుండా.. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను దోపిడీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అంతేకాకుండా వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. పవన్ వాలంటీర్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని.. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయమని అంబటి పేర్కొన్నారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా అని మంత్రి సవాల్ విసిరారు. అంతేకాకుండా.. జనసేన కార్యకర్తలను పవన్ ముంచేస్తారని రాంబాబు జోస్యం చెప్పారు. విశాఖపై పవన్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని రాంబాబు స్పష్టం చేశారు.
Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!
రుషికొండను సందర్శించే పేరుతో పవన్ కళ్యాణ్ హడావుడి చేశారని మంత్రి అంబటి పేర్కొన్నారు. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోందని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే చర్యలు తప్పవని.. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి తెలిపారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్ట్ చేయడం సాధారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు.
- Tags
- Ambati
- fired
- janasena
- pawan kalyan
- YSRCP
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!