Venkaiah Naidu: విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణామాలపై ప్రజలు ఆలోచన చేయాలి.. రాజకీయ నాయకుల నడవడిక, పని తీరును ప్రజలు గమనిస్తుండాలి.. ఎప్పుడూ ఆదర్శంగా, క్రమశిక్షణతో నమ్మిన సిద్దాంతం కోసం పని చేయాలని సూచించారు. జట్కా బండి పైన తిరిగి అద్వానీ, వాజ్ పాయ్ ప్రచారం చేసేవారు.. లా చదువుకుని, జన సంఘ్ పట్ల ఆకర్షితుడై, ఆ తరువాత బీజేపీ కోసం శ్రీమన్నారాయణ పని చేశారని గుర్తు చేశారు. ఎన్నికలలో పోటీ చేయకుండా, పదవులు ఆశించకుండా ఆయన పార్టీ కోసం పని చేశారు.. మన ప్రవర్తన చూసి మన పార్టీ పై నమ్మకం కలిగించాలి.. మన మాట, మన పని, మనం చేసే సాయమే నాయకుడిగా ఎదిగేలా చేస్తుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
Read Also: Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!
అయితే, ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పాడిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బస్సుల రాకపోకల తరహాలో.. రాజకీయ నాయకుల రాకపోకలు అని వారి వివరాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సరైనా కారణం ఉంటేనే నాయకులు పార్టీ మారేవారు.. కానీ, ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు అని మండిపడ్డారు. ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పని చేసేవారే నిజమైన నాయకుడు.. రాజకీయ నాయకులకు సమయ పాలన కూడా ఎంతో ముఖ్యం అన్నారు.
Read Also: Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది
ఇక, నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే.. కష్టం అనేది ఉండదు.. ఎదుటి వారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుంది అని తెలిపారు. ఎవరితోనైనా స్నేహం మన కనురెప్ప లాగా ఉండాలని సూచించారు. ఎప్పుడు అవసరం వచ్చినా కనురెప్ప లాగా ఆ కష్టానికి అడ్డంగా నిలబడాలని మాజీ ఉపరాష్ట్రపతి తెలియజేశారు.
