నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు.
పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం.. మూడు ముళ్లతో వందేళ్లు కలిసి బ్రతికె అద్భుతమైన ఘట్టం.. అందుకే ఈ బంధానికి జనాలు విలువ ఇస్తారు.. ఈ బంధంలో ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం ఉండాలి. అలాగే దంపతుల మధ్య హెల్దీ రిలేషణ్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది కనిపించడం లేదని తెలుస్తోంది!