ఆగస్టు 14నే కాదు ఇయర్ ఎండింగ్‌లో కూడా ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్దమవుతున్నారు. వాళ్లే రణవీర్ సింగ్ అండ్ షాహీద్ కపూర్. రణవీర్ ధురంధర్ తో ఈ ఇయర్ ఎండింగ్ రాబోతున్నాడు. తెలుగులో రాజా సాబ్ వస్తున్న డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. దీంతో మరోసారి నార్త్, సౌత్ మధ్య ఫైట్ తప్పేట్లు లేదు అనుకున్న టైంలో రాజా సాబ్ వాయిదా పడొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ హీరోగా సోలోగా థియేటర్లకు వచ్చేస్తున్నానన్న రణ్ వీర్ సింగ్ ఆనందాన్ని ఆవిరి చేశాడు షాహీద్. ధురంధర్ లో గల్లీబాయ్ ను ఊరమాస్ యాంగిల్లో చూపించబోతున్నాడు ఆదిత్యధర్. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read : Jr NTR : వార్ 2 ప్రమోషన్స్ పై తారక్ అభిమానుల్లో ఆందోళన
ఈ ఏడాది జనవరిలో దేవాతో పలకరించాడు షాహీద్ కపూర్. కానీ ఈ మలయాళ రీమేక్ బాలీవుడ్ ఇలాకాలో బోల్తా కొట్టింది. మళ్లీ కిక్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు కబీర్ సింగ్. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటయ్యాడు. అర్జున్ విస్తారాగా టైటిల్ ఫిక్స్ కాగా, రీసెంట్లీ రోమియోగా ఛేంజ్ అయ్యింది. ఇదొక యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతోంది. త్రిప్తి ఫీమేల్ లీడ్ కాగా, తమన్నా ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. రొమియోను కూడా ఈ డిసెంబర్ 5నే తీసుకురాబోతున్నారు మేకర్స్. మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో షాహీద్ లుక్ ఉంటుందని ఎప్పుడో చెప్పాడు డైరెక్టర్. దాంతో డిసెంబరు 5న రణ్వీర్ ఢీ కొట్టబోతున్నాడు షాహీద్. పద్మావత్ లో నేరుగా తలబడిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ రణరంగానికి దిగబోతున్నట్లే. మరి ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిదో.