Margani Bharath Fires On Chandrababu Naidu Nara Lokesh: టీడీపీకి ఇది మహానాడు కాదని, రాజకీయంగా చివరినాడు కాబోతోందని వైసిపి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడవటం దేనికి, శత జయంతి ఉత్సవాలు జరపడం దేనికి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ వల్ల ఏపీ ప్రతిష్ట కేంద్రం వద్ద దిగజారిందని మండిపడ్డారు. తాము దండి మార్చ్ విగ్రహాలు పెడితే, అక్కడ తెలుగుదేశం జెండాలు పెట్టారన్నారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వాస్తవమా కదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ పార్టీని, బ్యాంక్ అకౌంట్స్‌ని లాక్కున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఎన్టీఆర్ గాడ్సేతో పోల్చారని గుర్తు చేశారు. మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారని అడిగారు. లోకేష్‌కు పట్టం కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Naveen Ul Haq: సారీ ట్వీట్‌పై నవీన్ రియాక్షన్.. రిపోర్ట్ చేయమంటూ సూచన
తాతకి వెన్నుపోటు పొడిచారని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారని, అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు గురించి ఆలోచించాలని హితవు పలికారు. టిడిపి అధికారంలోకి వస్తే, వాలంటీర్ వ్యసస్థ కొనసాగిస్తామని టీడీపీ ఎందుకు తీర్మానం చేయట్లేదని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ వ్యతిరేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాల్లో 2500 ఎకరాల వరకు పేదలకు భూమి ఇవ్వొచ్చని, ఇంకా 1100 ఎకరాల భూమి పేదలకు ఇవ్వొచ్చని తెలిపారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. సెంటు భూమి సరిపోదంటూ పేదలను అచ్చెన్నాయుడు అవహేళన చేస్తున్నారని.. టీడీపీకి పేదల ఓట్లు వద్దా? అని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే తప్పేంటని నిలదీశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని లేఖలు రాస్తున్న రఘురామ కృష్ణరాజుకి మహిళలు బుద్ది చెప్తారని హెచ్చరించారు.
Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
ఇక నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారని మార్గాని భరత్ స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్ భవన నిర్మాణం ఉందన్నారు. భారత్‌కు పూర్వ వైభవం వచ్చేలా జరిగిన పార్లమెంట్ నిర్మణాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి 10,460 కోట్ల ఆర్ధిక లోటు నిధులు సాధించామని వెల్లడించారు. మహానాడులో జగన్‌కి కితాబు ఇస్తే, ఏపీ ప్రజలు స్వాగతిస్తారన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిని జగన్ కలిసి.. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారని చెప్పుకొచ్చారు.