మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి…