గంజి ప్రసాద్ హత్య బాధాకరం అన్నారు హోం మంత్రి తానేటి వనిత. గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. అనుమానితుడైన ఎంపీటీసీ బజరయ్యపై విచారణ సాగుతుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు.
నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష తప్పదు. ముఖ్యమంత్రి దృష్టికి ప్రసాద్ హత్య ఘటన తీసుకువచ్చామన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటాం. ప్రజలు సంయమనం పాటించాలన్నారు మంత్రి తానేటి వనిత. ఇదిలా ఉండగా..గంజి ప్రసాద్ కొడుకు మాట మార్చాడు. నిన్న ఆవేశం లో ఎమ్మెల్యే పై మాట్లాడాం. ఎమ్మెల్యే పై మేము కంప్లైంట్ చేయలేదన్నాడు.