వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యోదంతం రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే నిందితులు ఆయన్ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలినా.. రాజకీయంగా ఇది ఊహించని మలుపులు తిరుగుతోంది. ఓవైపు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే తెరవెనుక ఉండి ఈ హత్య చేయించాడని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు, గంజి ప్రసాద్ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అయితే, తనపై దాడి చేసింది…
గంజి ప్రసాద్ హత్య బాధాకరం అన్నారు హోం మంత్రి తానేటి వనిత. గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. అనుమానితుడైన ఎంపీటీసీ బజరయ్యపై విచారణ సాగుతుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష తప్పదు. ముఖ్యమంత్రి దృష్టికి ప్రసాద్ హత్య ఘటన తీసుకువచ్చామన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటాం. ప్రజలు సంయమనం పాటించాలన్నారు మంత్రి…