Tirumala: కలియుగ దైవం తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. చిరుతను చూసి భయంతో కేకలు వేశారు. ఈ విషయం తెలిసిన అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది. దీంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక, అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. తిరుమలలో మళ్లీ చిరుత సంచారంతో భక్తుల్లో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
Read Also: CP Sajjanar: డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టాం.. సీపీ సీరియస్..
మరోవైపు, తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కి భక్తుల నుంచి రూ. 2300 కోట్లు విరాళంగా అందాయని ఈవో సింఘాల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ. 180 కోట్ల విరాళాలు వచ్చాయి.. అన్నప్రసాద ట్రస్ట్ కి రోజు వారిగా కోటి రూపాయలు విరాళంగా అందుతున్నాయి.. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉద్యోగుల నియామకంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకుంది.. అన్నప్రసాద ట్రస్ట్ నిధులపై వచ్చే వడ్డితో ట్రస్ట్ నిర్వహణ చేస్తూన్నామని ఈవో సింఘాల్ వెల్లడించారు.