ఆరోగ్యకరమైన శృంగారం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. శృంగారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటికే బోలెడన్నీ పరిశోధనలు వచ్చాయి.
నోటిని ఉపయోగించాలి. నోటిని ఉపయోగించడమంటే మరెందుకో కాదు. శృంగార జీవితం బాగుండాలంటే ముందు భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి.
ముఖ్యంగా చాలామంది స్త్రీలకు కేవలం శృంగారం వల్ల భావప్రాప్తి కలగదు. కాబట్టి శృంగారానికి ముందు కొన్ని భాగాలను సున్నితంగా స్పృశించడం వల్ల స్త్రీకి సంపూర్ణమైన భావప్రాప్తి కలుగుతుంది.
ముఖ్యంగా చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి.. ఎప్పుడూ ఒకే తరహాలో శృంగారం చేయడం అనాసక్తిని కలిగిస్తుంది. కాబట్టి శృంగారంలో కొత్త భంగిమలు ప్రయత్నించడం కూడా అవసరం.
ఎప్పుడూ బెడ్‌రూమ్‌లోనే శృంగారం చేయడం కూడా బోర్ కొట్టించే విషయం. కాబట్టి వీలును బట్టి ప్రదేశాలను మారుస్తుండాలి. ముఖ్యంగా వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో శృంగారాన్ని ఆస్వాదించాలి.
కొత్తగా ప్రయత్నించడానికి దంపతులు ఇద్దరు కలిసి సరదాగా ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేయవచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ ఇద్దరిలోనూ ఉత్సుకతను పెంచుతాయి.
మీ షెడ్యూల్ ఎంత బిజీ అయినా సరే.. శృంగారానికి మాత్రం దూరం కావద్దు. కాబట్టి ప్రతీరోజూ కచ్చితంగా శృంగారానికి సమయం కేటాయించేలా మీ షెడ్యూల్ మార్చుకోవాలి. శృంగారం మీ ఒత్తిళ్లన్నింటిని దూరం చేసే అద్భుత శక్తి.
శృంగారంలో చాలామంది పురుషులు తమకు భావప్రాప్తి కలగానే పక్కకు తిరిగి పడుకుంటారు. కానీ శృంగారాన్ని అలా ముగించకూడదని నిపుణులు చెబుతున్నారు. అనంతరం వారితో సరదాగా కబుర్లు చెబితే సంతోషం కలుగుతుందట.
శుభ్రత అవసరం శృంగారంలో శుభ్రత అనేది అత్యంత ముఖ్యం. భాగస్వామి నుంచి దుర్వాసన వస్తే.. శృంగారంపై విరక్తి కలగడం ఖాయం. కాబట్టి శృంగారానికి ముందు స్నానం చేయాలి.
భాగస్వామికి నొప్పి లేకుండా ఉండాలంటే లూబ్రికెంట్స్ వాడాలని నిపుణులు చెబుతున్నారు.