Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. టీడీపీని స్వాధీనం చేసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆమె ఆరోపించారు. అటు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. ఈనెల 25న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. గిడుగు బాషా ఉత్సవాల సందర్భంగా రేపు ఆరుగురిని పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy : ఆ మాజీ మంత్రికి అన్నీ వివాదాలేనా..! కంటిపై కునుకులేకుండా పోయిందా..?
Also Read
అటు చంద్రబాబు హయాంలో విద్యాశాఖను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో 30 వేల స్కూల్స్ మూత పడ్డాయన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేస్తున్నామంటున్న వారు వాళ్ళ పిల్లలను ఆంగ్ల భాషలో చదివించడం లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు ఆంగ్లభాషను అందుటులోకి తీసుకువచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. తెలుగుకు సీఎం జగన్ ద్రోహం చేశారని కొందరు అవాస్తవాలు మాట్లాడతున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్‌ను పెద్ద సంఖ్యలో మూసివేశారన్నారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల వద్ద స్థలం కేటాయించారని తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..