CPI Narayana: జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం లూటీ చేసింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు కార్పొరేట్లకు దోచిపెట్టి ఇప్పుడు జీఎస్టీ మార్పులు చేశారు.. జీఎస్టీ స్వరూపం మార్చాలి, రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ మాత్రం డొనాల్డ్ ట్రంప్ కి భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. నక్సల్స్ ను చంపుతామని అమిత్ షా అంటున్నారు.. నక్సల్స్ ను చంపిన సిద్ధాంతం ఎలా మారుతుంది.. గిరిజనుల ఆస్తుల కోసం నక్సల్స్ ను చంపుతామంటున్నారు.. ప్రభుత్వంలో ఉన్న వారిని కూడా గోరి కడుతున్నారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కూడా ఆపరేషన్ ఖగార్ ద్వారా అడ్డు తొలగిస్తున్నారు అని సీపీఐ నారాయణ అన్నారు.
Read Also: సంప్రదాయ వేషధారణలో కృితీ షెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ అయిన అందాల వేడి!
ఇక, ఏపీలో ఉన్న పార్టీలు అని మోడీకి దాసోహం అయ్యాయని నారాయణ పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో కలిసి పని చేసిన పార్టీలు అంతమైపోతున్నాయి.. మరోవైపు, తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా చీలింది.. బీజేపీ భస్మాసుర హస్తం, దీనికి టీడీపీ, జనసేన మినహాయింపు లేదు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంపాలనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు.. ఉదేశపూర్వక్షంగా ఫ్యాక్టరీని చంపి ఆ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు.