AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Student Suicide in US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి.. ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరు అయితే.. మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు.. తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాళ్లు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అమెరికాలో చదువుల కోసం వెళ్లిన కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
కర్నూలు జిల్లాకు చెందిన చందు అనే యువకుడు అమెరికాలోని చికాగో నగరంలో ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, అవకాశాలు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన చందు పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి.
ఇక మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు Telugu Association of North America (తానా) చర్యలు చేపట్టింది. అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉద్యోగ అవకాశాల కొరత వంటి సమస్యలను మరోసారి గుర్తు చేస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు చందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!