Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ వెనుక హిడన్ ఎజెండా.. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు రెడీ
- రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారు..
- రాయలసీమకు ఎన్టీఆర్ తప్ప ఎవరూ ఏమీ చేయలేదు..
- బడ్జెట్ తక్కువ ఉన్న రోజుల్లో రాయలసీమలో ప్రాజెక్టులు కట్టారు..
- కాంట్రాక్టర్ల కడుపు నింపడానికి రాయాలసీమ లిఫ్ట్..
- కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారని, అయితే వాస్తవానికి రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ గణనీయంగా ఏమీ చేయలేదని బైరెడ్డి విమర్శించారు. బడ్జెట్ పరిమితులు ఉన్న రోజుల్లోనే రాయలసీమలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు.
Read Also: Melinda Gates: ఎప్‌స్టీన్ ఫైల్ వల్లే బిల్‌గేట్స్‌తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
వైసీపీ నేతలకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, కానీ తిట్లు మాట్లాడడంలో మాత్రం వారు నైపుణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు బైరెడ్డి.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఏ ప్రాతిపదికన ప్రారంభించారో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ. 850 కోట్లు ఖర్చు చేశారని, అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము కాలువలో కొట్టుకుపోయిందని ఆరోపించారు. రైతులకు నీరు అందించడానికన్నా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారన్నారు. రాయలసీమ లిఫ్ట్ వెనుక స్పష్టమైన హిడన్ ఎజెండా ఉందని ఆరోపించిన బైరెడ్డి, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలో చర్చ జరపాలని వైసీపీ నేతలను ఆయన సవాల్ చేశారు.
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!