CM Chandrababu: నేను కూడా రాయలసీమ బిడ్డనే.. రాయలసీమలో ఫ్యాక్టన్ ఉండేది.. ఫ్యాక్షన్ ను కూకటివేళ్లతో పెకిలించాను అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. కేంద్రీయ విద్యాలయ సమీపంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప్రజా వేదికలో పీ4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు.. డ్రోన్, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర తదితర స్టాళ్లను పరిశీలించారు.. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కనీసం రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదని దుయ్యబట్టారు.. ఫ్యాక్షన్ తో గ్రామాలు నిర్వీర్యమై ఎగతాలిగా సినిమాలు తీసేవాళ్లు.. రాయలసీమలో ఎక్కడ లేని విధంగా 4 విమానాశ్రయాలు ఉన్నాయి.. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు.. ఓర్వకల్, కొప్పర్తి మౌలిక వసతులతో పారిశ్రామిక వాడలు ఏర్పాటు.. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచర్ల పూర్తి చేస్తే గేమ్ చెంజర్ అవుతుంది.. ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు అని వెల్లడించారు.
Read Also: BRS Party: మెట్రో టికెట్ రేట్స్ పెంపు.. ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్
నన్ను శాస్వితంగా గుర్తు పెట్టుకునేట్టుగా మీకు అండగా ఉంటాను అన్నారు సీఎం చంద్రబాబు.. 4.75 లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తున్నాయి.. 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.. ఓర్వకల్ కి రైలు మార్గం నిర్మిస్తాం అని ప్రకటించారు.. కల్లూరులోని 16 డివిజన్లలో నీటి సమస్య లేకుండా చేస్తాం.. ఇంటింటికి నీటి కుళాయిలు ఇస్తాం.. కల్లూరులో 16 కోట్లు 16 డివిజన్లలో అభివృద్ధికి ఖర్చు చేస్తాం.. సఫా కాలేజి నుంచి కర్నూలు సిటీ లోకి నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తాం అన్నారు.. ఇక, అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయని గుర్తుచేశారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం అందరికి ఆదర్శం.. పేద కుటుంబంలో పుట్టి ఉన్నతస్థాయికి ఎదిగారు.. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలన్నారు.. పీ4 కార్యక్రమం లో పేదవారు బంగారు కుటుంబాలుగా మారుస్తాం.. మార్గదర్శకులు పేదలను ఉన్నత స్థాయికి చేరేలా సహకరిస్తారు.. 2029కి జీరో పావర్టీ సాధిస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 146 మంది మృతి
ప్రతి 3వ శనివారం ప్రతి ఆఫీస్లో ఏ పని చేయకుండా ఆఫీస్ వాతావరణం శుభ్రం చేసుకోండి.. మంచి ఆలోచనలు చేయండి అని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.. వచ్చే నెల విశాఖలో అంతర్జాతీయ యోగాడేకి ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు. ఇక, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆధునిక ప్రపంచంలో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి.. సెల్ ఫోన్లు గంటల తరబడి చూస్తున్నారు.. ఆరోగ్యం చెడిపోతుంది అని హెచ్చరించారు. ప్రతి రోజు అరగంట యోగ చేస్తే అన్ని రోగాలు పటాపంచాలవుతాయి.. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా నిర్వహిస్తామని తెలిపారు.. ఇక, ప్రపంచంలో ఏదీ వృథా కాదు.. ప్రతి ఒక్కటీ ఉపయోగపడుతుంది.. 90 శాతం చెత్త ఎనర్జీగా తయారు చేయవచ్చు అన్నారు. ఓర్వకల్ మండలంలో పాలకోవ తయారు చేస్తూ ప్రసిద్ధి చెందారు.. ఈ ఏడాది లక్షమంది మహిళలను పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాం.. ఇళ్లలో వచ్చే తడి చెత్తను కంపోస్టు తయారు చేసేలా పొదుపు మహిళలు చైతన్యం చేయాలి.. తడి చెత్తను సేకరించి కంపోస్టుగా తయారు చేసి రైతులకు ఇవ్వాలి.. పొడి చెత్తను ఫాక్టరీలకు పంపుతాం అన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
డ్వాక్రా సంఘాలంటే రాజకీయనాయకులు కూడా భయవుడే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే చాటి చెప్పారన్నారు. జపాన్ లో ఎక్కడా రోడ్డులో చెత్త కనిపించదు.. రోడ్డు మీద పేపర్ కనిపిస్తే తీసుకువెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారని తెలిపారు.. పల్లెల్లో చెరువులను పునరుద్ధరించేందుకు పల్లె పుష్కరిణి కార్యక్రమం అమలు చేస్తాం.. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.. మెగా డీఎస్సీ తో 16500 టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..