KRMB Letter: విద్యుత్ ఉత్పత్తి ఆపండి..కేఆర్ఎంబీ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబీ. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది కేఆర్ఎంబి. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఆరు టీఎంసీలు తాగునీటికి కోసం అవసరం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 34.24టీఎంసీలు మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
నిండుకుండలా ఉండాల్సిన శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుకుంటోంది. 215 టీఎంసీల సామర్థ్యానికి.. 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తిచేయడంతో ఈ దుస్థితి వచ్చిందటున్నారు ఇరిగేషన్ నిపుణులు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్తులో శ్రీశైలం వాటానే చెరో 40శాతంగా ఉండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయ్. అయితే పరిస్థితులను ముందే ఊహించి, ఐదు నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ బోర్డు లేఖలు రాసింది. తాగు, సాగు నీటి అవసరాల కంటే ఎక్కువగా నీరు ఉంటేనే జలవిద్యుత్తు ఉత్పత్తి జరగాలి. కానీ విద్యుదుత్పత్తి కోసమే నీటిని వినియోగించి.. సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీల నీరు ఉంది. కాని ఇప్పుడు నీటి నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు పడిపోయింది. కేఆర్‌ఎంబీ లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది వెయ్యికిపైగా టీఎంసీల మేర ఇన్‌ఫ్లో వచ్చినా.. ప్రస్తుత నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు మేల్కోకపోతే సమ్మర్‌లో తాగునీటి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!