Minister kollu Ravindra: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనపై సెటైర్లు వేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్న ఆయన.. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుండి రైతులను తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని దుయ్యబట్టారు.. పొలం గట్ల మీద నడిచి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు.. తుఫాన్ తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేశారని మండిపడ్డారు.. జగన్ పర్యటన అద్యంతం పచ్చి అబద్దాలతో సాగింది.. జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదు.. కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించాడు.. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచి లేదని పేర్కొన్నారు.
Read Also: Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!
ఇక, పంట కాలువలను బాగు చేయడం వల్లే పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు ఎప్పటికప్పుడు కాలువల గుండా వెళ్లిపోయింది.. ఫలితంగా రైతులు చాలా వరకు నష్టపోకుండా చూడగలిగాం అన్నారు కొల్లు రవీంద్ర.. వైసీపీ ఐదేళ్ల పాలనలో కాలువల్లో చారడు మట్టి కూడా తీయలేదన్న ఆయన.. చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదన్నారు.. తల్లిని చెల్లిని పట్టించుకోని వ్యక్తి జగన్.. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. RTGS నుండి తుఫాన్ సహాయ చర్యలపై చంద్రబాబు, లోకేష్ నిరంతరం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.. తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజే ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని సీఎం చూశారు.. ఆ మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన చేసి పంట నష్టం అంచనాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేశాం.. పంట నష్టం నమోదుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.. ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం విశేషంగా కృషి చేసింది.. తుఫాన్ సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాహితంగా పని చేశారు.. కానీ, పని చేసే అధికారులను అవమానపరిచే విధంగా జగన్ మాట్లాడిన తీరు గర్హనీయం అని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర..