NTV Telugu Site icon

Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?

Kollu

Kollu

Kollu Ravindra: మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. పీడీఎస్ కేసు నమోదు కావడంతో మూడు నెలలు తండ్రి కొడుకు అడ్రస్ లేకుండా పోయారు.. బెయిల్ రాగానే బయటకు వచ్చి.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. బెయిల్ రాగానే అయిపోయింది అనుకోవద్దు.. దీనిపై సిట్ ఏర్పాటు చేశాం త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.. వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు దొంగ జీవోలు ఇచ్చారు అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Read Also: Ranya Rao Case: రన్యా రావు కోసం కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రమేయం..!

ఇక, 50 కోట్ల రూపాయల విలువైన భూమిలో మీ ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇస్తే సరిపోతుందా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. పేర్ని నానికి జీవోలు చదవటం రాదా అని అడిగారు. అధికారులను బెదిరించడం వాళ్ళ మీద చిందులు వేయటం మానుకోవాలి అని సూచించారు. బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అసలు మీకు సిగ్గుందా.. మనిషివేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని పనులు చేసేది వైసీపీ వారు తప్ప టీడీపీ వారు కాదు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.