Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి హార్బర్‌ను సందర్శించిన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి అధికారుల బాధ్యతారాహిత్యం, గుత్తేదారు నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై సంబంధిత అధికారుల తీరును ప్రశ్నించారు. హార్బర్ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగానే పనుల్లో జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇంతకాలంగా పనులు పూర్తికాకపోతున్నా ఎందుకు దృష్టి పెట్టడం లేదని కలెక్టర్‌ను ప్రశ్నించారు. మూడేళ్ల కాలపరిమితితో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్, ఐదేళ్లు పూర్తయినా నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.
అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించాలని సూచించారు. ప్రాజెక్టు పనులు ఇకపై మరింత ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు, పనులు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలల సమయం ఇవ్వాలని గుత్తేదారు మంత్రిని కోరారు. ఇప్పటికే రెండేళ్లపాటు గడువు పొడిగించినా పనుల్లో పురోగతి లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం సమయం ఇవ్వాలని ప్రశ్నించారు. సీ మౌత్ (Sea Mouth) డిజైన్ అందకపోవడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని గుత్తేదారు వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి కుంటిసాకులు ఇంకెన్ని రోజులు చెబుతారని మంత్రి మండిపడ్డారు.
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ఇకపై పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తక్షణమే పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతోపాటు కాంట్రాక్టర్ ఆస్తులను జప్తు చేసే చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయడంలో ఇకపై ఎలాంటి జాప్యానికీ అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!