Gudlavalleru Engineering College Incident: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో కీలక పరిణామాలు..
- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి సెలవులు..
- ఇవాళ.. రేపు హాస్టల్ విద్యార్థులకు సెలవు ప్రకటించిన యాజమాన్యం..
- సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి సమ్మె యోచన..
- ఎస్పీ కామెంట్స్‌తో మరింత పెరిగిన ఉద్రిక్తత..
- మంగళవారంలోగా సమస్య పరిష్కరిస్తామన్న మంత్రి కొల్లు..
- మంత్రి కొల్లు హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ..
- ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తరలించే ప్రయత్నంతో మరోసారి ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudlavalleru Engineering College Incident: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. స్పాట్‌కు వచ్చిన ఎస్పీ గంగాధర్ మొత్తం సంఘటనా స్ధలాన్ని పరిశీలించకుండానే అక్కడ ఎలాంటి కెమెరాలు లేవనడం పై విద్యార్ధినులు సీరియస్ అయ్యారు.. అయితే వార్డెన్‌ను కూడా విచారించిన పోలీసులు తమ వాదనను మార్చడం.. కెమెరాల అంశం పై పూర్తి దర్యాప్తు జరుగుతుందనడంపై అనుమానాలు వ్యక్తం చేసారు విద్యార్ధినులు. ఇక, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ కలిసి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు.. టెక్నికల్ టీంను ఏర్పాటు చేశామని.. పూర్తి విచారణ జరిపిన అనంతరం దీనిపై ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు.. మహిళా సిబ్బందితోనే విచారణ చేపట్టామని తెలిపారు కలెక్టర్. అసలు విద్యార్ధినుల హాస్టల్ కి కెమెరాలు ఎలా వెళ్ళాయి అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. అయితే.. కళాశాల యాజమాన్యం పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేయడమే కాకుండా తమను బెదిరించారని ఆరోపించారు విద్యార్ధినులు.. ఈ ఆందోళనలకు విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సైతం తోడవడంతో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Read Also: Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఘటనపై చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారులను, జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను అక్కడికి వెళ్లాలను సూచించారు. సీఎం ఆదేశాలతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎల్ఏలు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. వచ్చే మంగళవారం లోగా న్యాయం చేస్తామని విద్యార్ధినులకు హామీ ఇచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కొల్లు, ఐదు హామీలతో కూడిన పత్రాన్ని యాజమాన్యం నుంచి విద్యార్థినులకు అందజేశారు. మంత్రి చొరవతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు విద్యార్ధినులు. కళాశాలలోనే విచారణ జరుగుతుండగా.. మహిళా కమిషన్, స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఈ కెమెరాల అంశంపైన పూర్తి విచారణ జరపాలని మహిళా కమిషన్ అధికారులను ఆదేశించింది.. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళతామని తెలిపింది. అటు ఘటనపైన విచారణ జరుగుతుండగా వైసీపీ నేతలు పేర్ని కిట్టు, జడ్పి చైర్ పర్సన్ హారిక, ఎంఎల్సీ వరుదు కళ్యాణి కళాశాలకు రావడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. లోనికి అనుమతించకపోవడంపై వైసీపీ శ్రేణులు రెండు గంటలకు పైగా మెయిన్ గేటు వద్ద ఆందోళన చేసారు. పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు వైసీపీ శ్రేణులు.
Read Also: Redmi 14C: తక్కువ బడ్జెట్ లో అబ్బురపరిచే ఫీచర్లతో రాబోతున్న రెడీమి 14C..
అంతా సర్దుమణిగింది అనుకునే లోపే.. విద్యార్ధిని, వార్డెన్‌లను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడంతో మరోసారి కళాశాలలో వాతావరణం వేడెక్కింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా మంగళవారం లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్ధినులు కళాశాలలో స్ట్రైక్ చేసేటందుకు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. అయితే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.. నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించిన విద్యార్ధినులు.. రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ధినిని తరలించే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేయడంతో.. మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది.. విద్యార్ధినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు.. ఈ రోజు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.. ఎంత ఆందోళన చేస్తున్నా… ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటున్న విద్యార్ధినులు.. తలిదండ్రులు వస్తేనే ఇళ్ళకు పంపుతామనడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విద్యార్ధినులు.. మరోవైపు.. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.. ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి.. కాలేజి విజిట్ కు వస్తారని, అందుకు తగ్గ ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..