Perni Nani: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిధిలో దొరికే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం జరగకపోయినా.. మలినమైపోయింది అంటూ పలుమార్లు మార్చి మార్చి అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జలిపడే కన్నా భయపడాల్సి వస్తుందన్నారు..
Read Also: Tirupati Laddu Controversy: సీబీఐ విచారణ చేయాలి
భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించాడు.. స్వయంగా ఆలయ సంరక్షణ అధికారులు చెప్పారు.. నెయ్యిని ప్రక్కన పెట్టాం.. టెస్టుల్లో తప్పులు దొరికాయి.. కాబట్టి ప్రక్కన పెట్టాం అని చెప్పారని తెలిపారు పేర్నినాని.. కానీ, పూటకో కారణం చెప్పి యిప్పటికీ ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నెయ్యి వాడారు.. కానీ, ఎక్కడ ఎందులో వాడారో తెలియదని అంటున్నాడన్నారు.. 70 ఏళ్ల వయస్సులో ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు గారు.. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు.. ఎంత ఆదర్శంగా బతికి చూపించమనేది ముఖ్యం అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ప్రపంచం అంతా రాజకీయ నాయకుడు అంటే ఇలాగే బతకాలని చూపించిన నాయకుడు ఆయన అన్నారు.. 75 ఏళ్ల వయస్సు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడానికి వెళ్తుంటే తిరుపతిలో ఫ్లెక్సీ లు పెట్టిస్తావా? అని మండిపడ్డారు.. తిరపతిలో పుట్టాను అంటున్నావు.. అసలు ఇక్కడ పుట్టావా..? ఏనాడైనా ఫ్లెక్సీల సంస్కృతి ఉందా? అని నిలదీశారు.. కోడి గుడ్లు, రంగు బుడగలు వేయించడానికి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించారు.. కాషాయం రంగు పూకుముకున్న కొందరు హిందూ మతానికి రాష్ట్రంలో మేమే ప్రతినిధులం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని..