Krishna Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి

  • కృష్ణా జిల్లా పెడన బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • బైకును ఢీకొన్న లారీ
  • బైక్ మీద ఉన్న ముగ్గురిలో ఇద్దరు మృతి.
Road Accident

Road Accident

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే చనిపోయి ఉన్నారు. మృతులు పాలపర్తి శాంతిరాజు( 26), పీతల అజయ్ (22), బాపట్ల విజయచంద్రపాల్ (35)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పెడన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.