NTV Telugu Site icon

Child Kidnap: ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్.. ఏడుగురి సిబ్బందిపై వేటు

Kidnap

Kidnap

Child Kidnap: కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి అప్పుడే పుట్టిన మగ శిశువు కిడ్నాప్‌కు గురైంది. తల్లి పొత్తిళ్లలో ఉన్న శిశువును నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. కిడ్నాపర్ మహిళ పసిపాపను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఆస్పత్రిలో అమర్చిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పసికందు తల్లిదండ్రులు, ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాప్‌ చేసిన మహిళ మచిలీపట్నం రామానాయుడుపేట చెరుకు రసం అమ్మే మహిళగా గుర్తించారు. వివరాల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు. పసికందును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్‌ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి

ఇదిలా ఉండగా.. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్‌ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్‌ఎన్‌వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రాథమిక విచారణ తర్వాత చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పూర్తి విచారణ చేసిన తర్వాత మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది.