వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కాంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు.
అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికి విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతుందని తెలిపారు.. అన్నీ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని..ప్రతీ షాపులో అన్నీ బ్రాండ్స్ అందుబాటులోకి తేవటం వల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా తగ్గిందని మంత్రి వెల్లడించారు..
రోడ్ల మీద మద్యం సేవించకుండా ఉండేందుకే పర్మిట్ రూంలు తెచ్చామన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు..స్పిరిట్ కేసు గుర్తించాం.. తెలంగాణలో తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం..ఎన్ఫోర్స్మెంట్ బాగా పనిచేస్తుంది..పక్క రాష్ట్రాల నుంచి కూడా స్పిరిట్ రవాణా కాకుండా చూస్తున్నామన్నారు కొల్లు రవీంద్ర.