Kethireddy Pedda Reddy Counter To JC Prabhakar Reddy: తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతులందరికీ బీమా వచ్చిందని, వారితోపాటే తనకూ వచ్చిందని స్పష్టం చేశారు. తనకు లబ్ది చేకూరిందని, జేసీ బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. జేసీకి వ్యవసాయం తెలియదని దుయ్యబట్టారు. జేసీ తన మీద కాకుండా.. టీడీపీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. తాను నిజాయితీగా వ్యవసాయం, వ్యాపారం చేసి సంపాదించానని.. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సైకో అని విమర్శించారు. 2024లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. తన ఉనికి కోల్పోతుందంటే.. తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. 2024లో ఎన్నికలు అయ్యాక నేను పాడెక్కుతానో, నువ్వు పాడెక్కుతావో చూస్తానని సవాల్ విసిరారు.
Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్
కాగా.. అంతకుముందు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పంట బీమా సొమ్ముని స్వాహా చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గౌతమికి ఫిర్యాదు చేసిన ఆయన.. ఏడాదిన్నర వయస్సున్న చీనీ పంటకు బీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. రూ.14 లక్షల క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ముని కేతిరెడ్డికి ఎలా ఇస్తారని నిలదీశారు. విచారణ జరిపి ఎమ్మెల్యేకు వచ్చిన పంట బీమా సొమ్ముని రికవరీ చేయాలన్నారు. కేతిరెడ్డి కుటుంబం ఎలా బతికిందో చెబుతానని, వాళ్ల తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం కూడా వారికి లేదని ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన పంటల బీమాను కేతిరెడ్డి చిన్నాన్న అక్రమంగా కొట్టేశారని.. ముందు ఆయనను చెప్పుతో కొట్టు అని కేతిరెడ్డికి సవాల్ చేశారు. ఈ విధంగా జేసీ తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. పైవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Fake Post: కోపంతో పోయాడంటూ పోస్ట్.. చివరిచూపుకోసం బారులు తీరిన బంధువులు